
కామారెడ్డి/ ఎల్లారెడ్డి/ప్రాంతీయ వార్తలు మే 18 ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ధాన్యం ఆరబెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల షెడ్లు ఎగిరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలివాన ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు చీకటిలో మునిగిపోయాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
రైతులు మాట్లాడుతూ, అకాల వర్షం కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయి భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు.