ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం.
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06.నాగిరెడ్డిపేట్ మండల రైతులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నిరంతర కృషి ఫలితంగా పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు రూ.40 లక్షల నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి.నాగిరెడ్డిపేట్ మండల రైతులు పలుమార్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, చెట్లు, మట్టి దిబ్బల కారణంగా సాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని విన్నవించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో...