PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:39 pm Posted by : RAVINDHAR

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినం,చిల్లర్గిలో ఘనంగా ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 04

జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* జన్మదినాన్ని పురస్కరించుకుని పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించి ఘన విజయం సాధించింది.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారితో* పాటు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* పాల్గొని వైద్య సేవలను, రక్తదాతలను అభినందించారు.
ప్రముఖ వైద్య నిపుణులు వివిధ వ్యాధులకు ఉచిత పరీక్షలు చేసి, రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జుక్కల్ నియోజకవర్గ నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సామాజిక బాధ్యతతో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీగా రక్తదానం చేశారు.
జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి.”

తోట లక్ష్మీకాంతరావు (ఎమ్మెల్యే)
“ప్రజా సేవే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని ఇలా సేవా దినోత్సవంగా మార్చి ప్రజలకు మేలు చేయడం అభినందనీయం.”

ఏలే మల్లికార్జున్ (డీసీసీ అధ్యక్షులు)

ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించి, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పూర్తిగా ప్రశంసించారు.