PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 1:49 pm Posted by : RAVINDHAR

ఎన్నో ఏళ్ల కల ఈరోజుకి నెరవేరింది ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన ఇందిరమ్మ ఇళ్ల యజమాని

నా కన్నీళ్ల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుని ఇంటి కల నెరవేర్చిన నాయకుడు
నిరాశలో ఉన్న నాకు…అండగా నిలబడ్డ నాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న

నాగిరెడ్డి పేట్ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారుడు ఎన్నో ప్రభుత్వాల చుట్టూ తిరిగినా, ఎన్నో వినతులు ఇచ్చినా తన బాధను పట్టించుకున్న నాయకుడు దొరకలేదని కన్నీటి కళ్లతో గుర్తుచేసుకున్నారు.

అయితే ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నాగిరెడ్డి పేట్ పర్యటనలో భాగంగా ఆ కుటుంబాన్ని స్వయంగా సందర్శించారు. గుడిసెలో వారి దయనీయ పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించారు.

ఇంటి నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశం జరిగిన రోజు లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేకపోయాయి. కొత్త ఇంటి ముందు నిలబడి ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ —

“నా జీవితంలో నేను ఎప్పుడైనా సొంత ఇల్లు కడతానని అనుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలకు దరఖాస్తులు పెట్టాను. కానీ ఎవరూ నా బాధను చూడలేదు. మదన్ మోహన్ అన్న గారు మాత్రం ‘నీకు ఇల్లు కట్టిస్తాను’ అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇప్పుడు నా పిల్లలు గౌరవంగా జీవించే ఇల్లు వచ్చింది. ఈ సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేను” అని కన్నీటి స్వరంతో తెలిపారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ,
“నాయకుడు అంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాదు.. ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకుని అండగా నిలబడే వ్యక్తి కావాలి. మదన్ మోహన్ గారు అలాంటి నాయకుడు” అని కొనియాడారు.

గృహప్రవేశ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.