ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి మహాప్రభో. తలదాచుకునేందుకు నీడ లేదు.ఆ వృద్ధ దంపతులను ఆదుకునేది ఎవరు. ప్రభుత్వాన్ని ఆ వృద్ధ దంపతులు వేడుక
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14 కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి-రాజయ్య ఆ వృద్ధ దంపతులకు బతుకుచిత్రం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అది ఇల్లు కాదు మూడు కర్రల మధ్యన కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి కాస్త గట్టిగా గాలి వీచిన ఎగిరిపోయే ఆ ప్లాస్టిక్ కవర్ కిందే ఆ వృద్ధా దంపతులు ప్రపంచ నడుస్తుంది. ఒకవైపు కడు పేదరికం. మరోవైపు రోగాలమయమైన వృద్ధాప్యం వెంటాడుతున్న. తల దాచుకోవడానికి కనీసం ఒక చిన్న గూడు కూడా లేక...