PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 5:54 pm Posted by : RAVINDHAR

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి మహాప్రభో. తలదాచుకునేందుకు నీడ లేదు.ఆ వృద్ధ దంపతులను ఆదుకునేది ఎవరు. ప్రభుత్వాన్ని ఆ వృద్ధ దంపతులు వేడుక

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 14

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ ఎర్రపహాడ్  గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి-రాజయ్య ఆ వృద్ధ దంపతులకు బతుకుచిత్రం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అది ఇల్లు కాదు మూడు కర్రల మధ్యన కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి కాస్త గట్టిగా గాలి వీచిన ఎగిరిపోయే ఆ ప్లాస్టిక్ కవర్ కిందే ఆ వృద్ధా దంపతులు ప్రపంచ నడుస్తుంది. ఒకవైపు కడు పేదరికం. మరోవైపు రోగాలమయమైన వృద్ధాప్యం వెంటాడుతున్న. తల దాచుకోవడానికి కనీసం ఒక చిన్న గూడు కూడా లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆకలి తీర్చే బడి. బడి ఆవరణను ఊడుస్తూ. వయస్సు పై పడటంతో వీరికి కూలి పన్నులు చేసే ఓపిక లేదు. వీరికి తోడుగా ఒక మనవరాలు ఉంది. ఆ పాప బాధ్యత కూడా ఈ వృద్ధులపైనే పడింది. ఆ గ్రామంలోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనమే ఈ వృద్ధ దంపతులకు ఆకలి తీరుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ బడి ఆవరణను ఊడుస్తూ కాలం గడుపుతున్నారు. సొంతగా ఒక చిన్న గూడు కట్టుకోవాలని ఉన్న రూపాయి తీసి రూపాయి పెట్టి సోమత వీరికి లేదు. అందుకే ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తారేమో అని వారి ఆశగా కళ్లు  కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే ఎలాగో డబ్బులు వస్తాయి ఆ వచ్చే డబ్బులను నమ్ముకొని. ఎవరైనా పెద్దమనసున్న దాతలు ముందుకు వచ్చి ఒక్క రూపాయి అయినా సాయం చేయకపోతారా? ముందుకు వచ్చి మాకు ఒక చిన్న గది అయినా కట్టించి ఇవ్వకపోతారా. అనే ఆశ ఆ వృద్ధ దంపతులను ప్రతిక్షణం  వెంటాడుతోంది ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయిస్తే ఆ డబ్బులతో ఎవరైనా పుణ్యాత్ములు  ముందుకొచ్చి ఆ వచ్చే నిధులతో మాకు ఒక గది అయినా పూర్తి చేసి ఇస్తే. ఈ తాటిపత్రి నరకం నుంచి బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాం అంటూ ఆ వృద్ధులు కన్నీళ్ళతో వేడుకుంటున్నారు.