PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 5:04 pm Posted by : RAVINDHAR

ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలపై చిన్నచూపు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం.  ఆ కళాశాల అంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన.   విష పురుగులు వచ్చిన చోద్యం చూస్తున్న విద్యా శాఖ అధికారులు. ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ప్రహరీ గోడ లేకపోవడ విష పురుగులు మరియు  గేదెలు  మేకలు ఎద్దులు వాటివి పశువులు. ప్రహరీ గోడ లేకపోవడంతో హరితహారం లో భాగంగా కళాశాలలో నాటిన మొక్కలకు భద్రత లేకపోవడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి కళాశాల చుట్టు ప్రహరీ గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు విపరీతంగా మొలుస్తాయి ఆ గడ్డిలో నుంచి విషపురుగులు రావచ్చని మండల ప్రజలు విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కళాశాలకు వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సులు సమయానికి రాక పోవటంతో క్లాసెస్ మిస్ అవుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. తాడ్వాయి  నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రభుత్వ కళాశాలకు వెళ్లాలంటే నిజాంసాగర్  నుండి కామారెడ్డి కి వెళ్లే ఆర్టీసీ బస్సులు దిక్కు. ఆ బస్సులు కూడా టైంకు రాకపోవడంతో. పాటు మరియు ఆ కళాశాల వద్ద బస్సులు  ఆపకపోవడం తీవ్ర ఇబ్బందిగా నెలకొందని విద్యార్థులు పేర్కొన్నారు. సాయంత్రం కామారెడ్డి నుండి నిజాంసాగర్ వెళ్లే బస్సుల తాడ్వాయి  ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆపకపోవడంతో విద్యార్థులు కళాశాల నుంచి తాడ్వాయి బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు నడుస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వెంటనే కామారెడ్డి డిఎం స్పందించి విద్యార్థులకు ఉదయం సాయంత్రం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బస్సులు ఆపే విధంగా చొరవ చూపాలని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు