PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 12:51 pm Posted by : RAVINDHAR

ఆరేపల్లి తండా వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30

రాజంపేట మండలం పరిధిలోని ఆరేపల్లి తండా కట్టపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బోర్‌బావి వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం వాహనం కట్ట కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన యువకుడిని అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.