PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 5:57 pm Posted by : RAVINDHAR

అర్ధరాత్రి చీకటిలో దారితప్పిన ఓ తల్లికి  సదాశివ నగర్ పోలీస్. నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇసాక్. రంజిత్ రెడ్డి. మానవత్వం చాటుకున్నారు

Praantiy Vartha Pratinidhi June 24

మానవత్వం చాటుకున్న సదాశివనగర్ పోలీసులు

అర్ధరాత్రి చీకటిలో దారితప్పిన ఓ తల్లికి  సదాశివ నగర్ పోలీస్. నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇసాక్. రంజిత్ రెడ్డి. మానవత్వం చాటుకున్నారు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట్ గ్రామ వీధుల్లో అర్ధరాత్రి చీకటిలో దారి తప్పిన ఓ తల్లికి ఆరాధన డయల్ 100 ద్వారా సదాశివ నగర్ పోలీసులకు చేరింది. వెంటనే స్పందించినవారు. ఆమెను ఆమె గమ్యస్థలానికి చేరువేశారు. మతిస్థిమితం సరిగా లేక సుమారు 60 ఏళ్ల వృద్ధురాలు అయోమయంగా తిరుగుతుందని సమాచారం పోలీసులకు అందింది నైట్ పెట్రోలింగ్ లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇసాక్ రంజిత్ రెడ్డి ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఇది  కేవలం ఒక ఫిర్యాదు కాకుండా. ఓ తల్లి ఆపదలో ఉందని గ్రహించినవారు వెంటనే అప్రమత్తమయ్యారు అక్కడికి చేరుకుని గాలించగా. ముఖంపై గాయాలతో. భయంతో వణికిపోతు కనిపించింది ఆ తల్లి. ఆమెను సదాశివ నగర్ గ్రామానికి చెందిన కుర్ర సావిత్రిగా పోలీసులు గుర్తించారు. గాయాలతో ఉన్న ఆ తల్లిని వెంటనే దగ్గరికి తీసుకుని ఓదార్చి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. స్వయంగా దగ్గరుండి చికిత్స చేయించి ధైర్యం చెప్పారు. బాధ్యత అక్కడితో తీరిపోలేదని భావించిన ఆ పోలీసులు. సావిత్రి బంధువుల కోసం ఆరా తీశారు. ఎట్టికేలకు వారిని సంప్రదించి. పూర్తి వివరాలు చెప్పి. ఆమెను సురక్షితంగా వారి చెంతకు చేర్చారు. అర్ధరాత్రి వేళ. గాయాలతో. మాట సాయం చేసే దిక్కులేక ఒంటరిగా మిగిలిన ఆ వృద్ధురాలికి పోలీసులే కొడుకులై నిలిచారు.