అనాథ విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 29,)కామారెడ్డి జిల్లా సదాశివనగర్, యూత్ ఫర్ సేవ సహకారంతో, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ)సామాజిక సమరసత వేదిక, ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామంలకు చెందిన తల్లి–తండ్రి లేని బాలబాలికలకు బుధ వారం విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, జ్యామెట్రీ బాక్స్‌లు, డ్రాయింగ్ బుక్స్ అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన, అనాథ చిన్నారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలనే...