అకాల వర్షం బీభత్సం సృష్టించింది ఎల్లారెడ్డి ప్రాంతం లో రైతన్నలు ఆగం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20 ఎల్లారెడ్డిమండలంలో రెండు రోజుల క్రితం ఈదురు గాలులు, అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. గంటకు 50కి.మీ నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వరి పంట నేలకొరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, కుప్పలుగా పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో పంటకు నష్టం.. రబీ పంట కోత దశలో ఉంది. కొందరు రైతులు పొలాల్లోనే కుప్పలు పోయగా, మరికొందరు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈదురు గాలులకు తోడు కురిసిన...